ఇస్రో కొత్త చరిత్ర.. నేడు తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ - 1 ప్రయోగం
ABN, Publish Date - Jul 18 , 2026 | 08:58 AM
భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌ను ఈరోజు (శనివారం) నింగిలోకి ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం నేడు ఆవిష్కృతం కానుంది.
భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌ను ఈరోజు(శనివారం) నింగిలోకి ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం నేడు ఆవిష్కృతం కానుంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్‌ను ఇవాళ ఉదయం 11:30కు శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. మిషన్ ఆగమన్ పేరిట భారత్‌లో ప్రైవేట్ సంస్థ నిర్మించి, ప్రయోగించనున్న తొలి ఆర్బిటల్ రాకెట్ ఇదని శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను.. లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి ఈ రాకెట్ తీసుకెళ్లనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తాం: మంత్రి తుమ్మల
హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Jul 18 , 2026 | 09:37 AM