అండాలను అక్రమంగా సేకరిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు

ABN, Publish Date - Nov 02 , 2026 | 11:03 AM

హైదరాబాద్‌లో యువతుల అండాలను అక్రమంగా సేకరిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 49 మంది యువతులను రెస్క్యూ చేసి కాపాడామని మల్కాజ్‌గిరి సీపీ సుమతి తెలిపారు.

హాస్టల్ పేరుతో ఇళ్లను అద్దెకు తీసుకొని అండాలను అక్రమంగా సేకరిస్తున్నట్లుగా గుర్తించామని సీపీ సుమతి తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలకు డబ్బు ఆశ చూపించి.. ఒక్కో అండానికి 20 నుంచి 30,000 చెల్లిస్తున్నట్టు సీపీ తెలిపారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఎర్రన్నాయుడు ఆశయాలే నా మార్గం.. ప్రజాసేవే నా లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు

మురసు తుఫాన్‌పై అప్రమత్తతో వ్యవహరించాలి.. అధికారులకు పవన్ ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated at - Nov 02 , 2026 | 11:08 AM