బైక్ ప్రమాద ఘటనలో మాజీ మంత్రి కుమారుడికి 14 రోజుల రిమాండ్
ABN, Publish Date - Jul 14 , 2026 | 08:25 AM
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసుకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసుకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. మూడు రోజుల క్రితం కాశీబుగ్గలో అతివేగంగా బైక్ నడిపి.. దానయ్య అనే గొర్రెల కాపరిని మాజీ మంత్రి కుమారుడు ఢీకొట్టాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరవ్ వ్యవహారం బయటపడింది. కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు అప్పలరాజు చేసిన డ్రామాలను పోలీసులు బయటపెట్టారు. తొలుత ఈ కేసులో సిద్ధు అనే యువకుడు తానే బైక్ నడిపి ప్రమాదం చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Updated at - Jul 14 , 2026 | 08:59 AM