స్థానిక ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్న సీఎం చంద్రబాబు కుటుంబం
ABN, Publish Date - Nov 26 , 2026 | 08:57 AM
ఏపీలో పంచాయతీ ఎన్నికలతో పాటు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబం ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంది.
ఏపీలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మిణి.. ఉండవల్లిలోని 53వ డివిజన్‌లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.
Updated at - Nov 26 , 2026 | 08:58 AM