ఆర్నబ్ తుపాను నిర్వహణపై చంద్రబాబుకు ప్రశంసలు

ABN, Publish Date - Oct 31 , 2026 | 10:24 AM

ఆర్నబ్ తుపానును ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాటి దివిసీమ ఉప్పెన నుంచి నేటి ఆర్నబ్ తుపాను వరకు.. అన్నీ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శం అని పేర్కొంటున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందరో ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు మాత్రం చాలా అరుదు. తుపాను, సంక్షోభాల సమయంలో సీఎంగా చంద్రబాబు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని.. క్రైసిస్ మేనేజర్ అని ఆయన తిరగరాశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యను తనదైన రీతిలో పరిష్కరించగల నేర్పు చంద్రబాబు సొంతమని నిరూపించారు.


ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated at - Oct 31 , 2026 | 10:24 AM