పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 23 , 2026 | 11:35 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విశాఖపట్నంలోని పేదలకు శాశ్వత హక్కు పత్రాలను అందజేశారు. 19 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలోని 400 ఎకరాల భూమిని క్రమద్ధీకరించారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విశాఖపట్నంలోని పేదలకు శాశ్వత హక్కు పత్రాలను అందజేశారు. 19 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలోని 400 ఎకరాల భూమిని క్రమద్ధీకరించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పేదల సొంతింటి కల నెరవేరిన వేళ అనేకమంది మహిళల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయి.
ఇంతవరకు కేవలం ఇళ్లు ఉన్న.. హక్కు లేని వారంతా ఈరోజు హక్కుదారులుగా మారడంతో వారిలో పట్టరాని ఆనందం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు చర్యలతో విశాఖపట్నం నగర పరిధిలో సుమారుగా 11 మండలాల్లో పేదలకు మంచి జరిగింది. 28,445 మంది పేదల పట్టాలకు సంబంధించిన కన్వెన్స్ డీడ్లను సీఎం పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
HAM మోడల్‌తో చాలా వినూత్నంగా ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 23 , 2026 | 11:43 AM