ఏపీకి మరో తుపాను ముప్పు.. నవంబర్ 2, 3 తేదీల్లో తీరం దాటే అవకాశం

ABN, Publish Date - Oct 30 , 2026 | 10:22 AM

‘ఆర్నబ్’ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే ఏపీకి మరో తుపాను రానుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనిస్తూ తుపానుగా మారుతుందని.. ఇది నవంబర్ 2, 3 వ తేదీల్లో మచిలీపట్నం, బాపట్ల మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

సాయికృష్ణ మృతి కేసులో అసలు దోషులెవరో తేల్చండి: సీబీఐకి తల్లి విజయలక్ష్మి విజ్ఞప్తి

నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టలో మంత్రి నారాయణ ప్రచారం.. ప్రజల ఘన స్వాగతం

Read Latest AP News And Telugu News

Updated at - Oct 30 , 2026 | 10:25 AM