ఏపీకి తుపాను ముప్పు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం

ABN, Publish Date - Oct 29 , 2026 | 12:29 PM

‘ఆర్నబ్’ తుపాను ప్రభావం ఇంకా ఏపీపై కొనసాగుతూనే ఉంది. కోస్తా ఆంధ్ర, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలున్నట్లు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో రైళ్లు దారి మళ్లింపు, పలు సర్వీసుల రద్దు

ఆర్నబ్ తుఫాన్ నష్టపరిహారంపై చంద్రబాబు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated at - Oct 29 , 2026 | 01:50 PM