సాక్షులను బెదిరిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరు?
ABN, Publish Date - Jul 01 , 2026 | 01:34 PM
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. సాక్షులను బెదిరించి, భయపెట్టిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. సాక్షులను బెదిరించి, భయపెట్టిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కీలకమైన సాక్షులను బెదిరించే చర్యలకు ఆయన పాల్పడుతున్నారు. అనంతబాబు తరపున సాక్షులను బెదిరించే పనిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తీసుకున్నారు. ఈ కేసులో కీలక సాక్షిగా అనంతబాబు వినియోగించిన కారు యజమాని మారారు. కారు యజమాని కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈ కేసులో మధ్యవర్తుల సాక్షులుగా 12 మంది చిరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీఆర్వోలు, వార్డు రెవెన్యూ కార్యదర్శులు అనంతబాబుకు వ్యతిరేకంగా.. సాక్ష్యం చెప్పకుండా ఉండేలా బెదిరింపులు, ప్రలోభాలకు అనంతబాబు గురిచేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు
ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Jul 01 , 2026 | 01:40 PM