Share News

సాబుదానా టిక్కి.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:29 PM

సాబుదానా టిక్కి.. తయారీకి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం- 250 గ్రాములు, ఉడికించి, పొట్టు తీసిన ఆలుగడ్డలు- మూడు, వేయించిన పల్లీ పలుకులు - అర కప్పు.

సాబుదానా టిక్కి.. తయారు చేసుకోండిలా..
Vantalu

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం- 250 గ్రాములు, ఉడికించి, పొట్టు తీసిన ఆలుగడ్డలు- మూడు, వేయించిన పల్లీ పలుకులు - అర కప్పు, పచ్చిమిర్చి-నాలుగు, అల్లం ముక్కలు- అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, జీలకర్ర - స్పూను, మిరియాల పొడి- కాస్త, నెయ్యి లేదా నూనె, ఉప్పు- తగినంత.


book8.2.jpgతయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నీళ్లలో నానబెట్టి వడకట్టి, పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో ఆలు, పల్లీలు, అల్లం, మిర్చి, కొత్తిమీర, జీలకర్ర,ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. చిన్న ముద్దలుగా చేసి వత్తుకుని పెనం మీద కాస్త నెయ్యి లేదా నూనె వేసి అటూ ఇటూ బంగారు రంగులో కాలిస్తే సాబుదానా టిక్కీ సిద్ధం.


ఈ వార్తలు కూడా చదవండి:

తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?

పర్యాటకం... సౌందర్యం... జమిలిగా...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 12:29 PM