పోహా వడ.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:52 PM
పోహా వడ.. తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి - రెండు స్పూన్లు, అటుకులు - కప్పు, పెరుగు - పావు కప్పు, అల్లం పేస్టు - అర స్పూను.
కావలసిన పదార్థాలు: బియ్యం పిండి - రెండు స్పూన్లు, అటుకులు - కప్పు, పెరుగు - పావు కప్పు, అల్లం పేస్టు - అర స్పూను, ఉల్లిముక్కలు - అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, కరివేపాకు రెబ్బలు - రెండు, కొత్తిమీర తరుగు - స్పూను, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా అటుకుల్ని నీళ్లలో కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పెరుగు, ఉప్పు వేసి కలిపి పదినిమిషాలు పక్కనపెట్టాలి. ఆ తరవాత మెత్తబడిన అటుకుల్ని ముద్దగా చేసుకోవాలి. ఇందులో ఉల్లి, మిర్చి, అల్లం పేస్టు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో బియ్యం పిండిని కూడా వేసి బాగా కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వడలా నూనెలో వేయిస్తే పోహా వడ తయారు. తక్కువ మంటమీదే ఈ వడలను వేయించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
స్కూలు పుస్తకంలో తన కథే ఓ పాఠంగా..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News