Share News

వైభవ్ విషయంలో టీమిండియా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది: ఇషాన్ కిషన్

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:47 AM

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

వైభవ్ విషయంలో టీమిండియా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది: ఇషాన్ కిషన్
Ishan Kishan, Vaibhav Sooryavanshi

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. భవిష్యత్తులో వైభవ్ గొప్ప క్రికెటర్‌గా ఎదగాలంటే ప్రస్తుతం ఒక్క క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని, ఆ దిశగానే టీమిండియా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందని ఇషాన్ తెలిపాడు (Ishan Kishan).


'వైభవ్ (Vaibhav Sooryavanshi) చాలా తెలివైన ఆటగాడు. మైదానంలో ఎలా ఆడాలో, మైదానం వెలుపల ఎలా ప్రవర్తించాలో అతడికి బాగా తెలుసు. అయితే చిన్న వయసులోనే పేరు రావడం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. స్నేహితులు, సోషల్ మీడియా, బయటి ప్రశంసలు, విమర్శలు అతడి దృష్టి మళ్లించే ప్రమాదం ఉంది. అందుకే అతడిపై అలాంటి ప్రభావం పడకుండా జట్టు సీనియర్ ఆటగాళ్లు నిరంతరం మార్గనిర్దేశనం చేస్తున్నారు' అని ఇషాన్ వివరించాడు.


'వైభవ్ ఎక్కువగా క్రికెట్ గురించే ఆలోచించేలా చూస్తాం. సోషల్ మీడియాలో ఏమి జరుగుతోంది, బయట ఎవరు ఏమంటున్నారు అనే విషయాలపై దృష్టి పెట్టొద్దని చెబుతుంటాం. ఒక్కోసారి పరుగులు రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలని సూచిస్తాం. నేను, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్‌తో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా అతడికి అండగా ఉంటున్నారు' అని తెలిపాడు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..

Updated Date - Jul 26 , 2026 | 11:47 AM