Share News

అస్సాంలో వరద బీభత్సం.. 66కు చేరిన మృతుల సంఖ్య..

ABN , Publish Date - Jul 26 , 2026 | 10:35 AM

ఇటీవలి భారీ వర్షాల కారణంగా వరదలు అస్సాంను అతలాకుతులం చేశాయి. అయితే శనివారం నాటికి వరద ప్రభావం కాస్త తగ్గింది. అయినప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

అస్సాంలో వరద బీభత్సం.. 66కు చేరిన మృతుల సంఖ్య..
Assam floods

ఇటీవలి భారీ వర్షాల కారణంగా వరదలు అస్సాంను అతలాకుతులం చేశాయి. అయితే శనివారం నాటికి వరద ప్రభావం కాస్త తగ్గింది. అయినప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 66కు చేరింది. ఇంకా 6.54 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావంలోనే ఉన్నట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) వెల్లడించింది (Assam floods).


తాజా వివరాల ప్రకారం, శివసాగర్, చరైదేవో, జోర్హాట్, దిబ్రుగఢ్, గోలాఘాట్, నాగావ్ జిల్లాలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వీటిలో శివసాగర్ జిల్లాలోనే సుమారు 2.9 లక్షల మంది, చరైదేవోలో 1.9 లక్షల మంది, జోర్హాట్‌లో 1.3 లక్షల మందికి పైగా వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గినా, అనేక గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. వేలాది మంది సహాయ శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు (Assam flood death toll).


వరద బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తోంది. బ్రహ్మపుత్రతో పాటు పలు ప్రధాన నదులకు వరదలు రావడంతో రహదారులు, వంతెనలు, వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతిన్నాయి (Brahmaputra flood). పంటలకు భారీ నష్టం వాటిల్లగా, అనేక కుటుంబాలు తమ ఇళ్లు కోల్పోయాయి. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..

Updated Date - Jul 26 , 2026 | 11:20 AM