పనీర్ ఫ్రైడ్ రైస్.. ఎలా తయారు చేయాలంటే..
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:31 PM
పనీర్ ఫ్రైడ్ రైస్.. తయారీకి కావలసిన పదార్థాలు.. మొక్కజొన్న పిండి- రెండు స్పూన్లు, పనీర్ ముక్కలు - పది, అన్నం - అర కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్టు - స్పూను, మిరియాల పొడి - అర స్పూను.
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి- రెండు స్పూన్లు, పనీర్ ముక్కలు - పది, అన్నం - అర కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్టు - స్పూను, మిరియాల పొడి - అర స్పూను, కారం - అర స్పూను, సోయా సాస్ - స్పూను, ఉల్లి ముక్కలు - అర కప్పు, క్యారెట్ ముక్కలు - అర కప్పు, క్యాప్సికమ్ - అరకప్పు, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: పనీర్‌ను ముక్కలుగా కోసి మొక్కజొన్న పిండిలో అద్ది, నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి అల్లం, వెల్లుల్లి పేస్టు వేయించాలి. ఓ నిమిషం తరవాత వేగిన పనీర్ ముక్కలు కలపాలి. రెండు నిమిషాల తరవాత అన్ని కూరగాయల ముక్కలూ జతచేయాలి. కారం, మిరియాల పొడి, సోయా సాస్ వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పును చేర్చాలి. కూరగాయలు మగ్గాక అన్నాన్ని చేర్చి రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికిస్తే పనీర్ ఫ్రైడ్ రైస్ సిద్ధం.
ఈ వార్తలు కూడా చదవండి:
ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News