ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీపీ సజ్జనార్ దంపతులు

ABN, Publish Date - Aug 02 , 2026 | 11:46 AM

సికింద్రాబాద్‌లో బోనాల సందడి నెలకొంది. ఉజ్జయిని అమ్మవారిని బోనం సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సికింద్రాబాద్‌లో బోనాల సందడి నెలకొంది. ఉజ్జయిని అమ్మవారిని బోనం సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా వారు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దంపతులు.. ఆదివారం మహంకాళి అమ్మవారిని దర్శించుకుని.. బోనం సమర్పించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించానని చెప్పారు. మన హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల పండుగకు ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని గుర్తు చేశారు.


ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగిశాయని. ప్రస్తుతం శ్రీ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా అమ్మవార్ల బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని సీపీ వీసీ సజ్జనార్ వివరించారు.

Updated at - Aug 02 , 2026 | 01:59 PM