Share News

వంటలు: మెక్సికన్‌ ఫ్రైడ్‌ రైస్‌.. ఇలా చేస్తే ఆ రుచే వేరు..

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:15 PM

మెక్సికన్‌ ఫ్రైడ్‌ రైస్‌ తయారీకి కావలసిన పదార్థాలు: అన్నం - రెండు కప్పులు, నానబెట్టిన రాజ్మా - అర కప్పు, క్యాప్సికమ్‌ - ఒకటి, టమాటాలు - రెండు.

వంటలు: మెక్సికన్‌ ఫ్రైడ్‌ రైస్‌.. ఇలా చేస్తే ఆ రుచే వేరు..
Vantalu

కావలసిన పదార్థాలు: అన్నం - రెండు కప్పులు, నానబెట్టిన రాజ్మా - అర కప్పు, క్యాప్సికమ్‌ - ఒకటి, టమాటాలు - రెండు, అల్లం ముక్కలు - కొన్ని, ఎండు మిర్చి - నాలుగు, ఉల్లి ముక్కలు - అర కప్పు, ఉడికించిన మొక్క జొన్న పొత్తులు - అర కప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ - స్పూను, ఉప్పు, నూనె - తగినంత.


book9.2.jpgతయారుచేసే విధానం: రాజ్మాను రాత్రంతా నానబెట్టాలి. ఉల్లి ముక్కలు, అరకప్పు నీళ్లతో కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. టమాటా ముక్కలు, అల్లం, ఎండు మిర్చిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేసి ఈ పేస్టును వేయించాలి. రాజ్మాను కూడా వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. క్యాప్సికమ్‌, మొక్కజొన్న, ఉల్లికాడ ముక్కలు, చిల్లి ఫ్లేక్స్‌ వేయాలి. కాస్త దగ్గరగా అవుతుంటే ఉడికించిన అన్నం జతచేసి.. సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేస్తే సరి.


ఈ వార్తలు కూడా చదవండి:

తొలి ఏడాది తీపి గుర్తులు!

అది మర్యాద కాదు...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 12:15 PM