ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్
ABN , Publish Date - Oct 04 , 2026 | 10:50 AM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి ఆమె దేశానికి అప్పగించేందుకు టైంఫ్రేమ్ (గడువు) ఏమీ లేదని బంగ్లాదేశ్‌కు భారతీయ హై కమిషనర్ దినేష్ త్రివేదీ అన్నారు. ఈ విషయంలో హసీనాకు ఎవరూ టైంఫ్రేమ్ ఇవ్వలేరని, భారత్ కూడా ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. హసీనాను తిరిగి తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ చేస్తున్న వినతిపై త్రివేదీ స్పందించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి ఆమె దేశానికి అప్పగించేందుకు టైంఫ్రేమ్ (గడువు) ఏమీ లేదని బంగ్లాదేశ్‌కు భారతీయ హై కమిషనర్ దినేష్ త్రివేదీ అన్నారు. ఈ విషయంలో హసీనాకు ఎవరూ టైంఫ్రేమ్ ఇవ్వలేరని, భారత్ కూడా ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. హసీనాను తిరిగి తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ చేస్తున్న వినతిపై త్రివేదీ స్పందించారు. బంగ్లా చేసిన విజ్ఞప్తిని ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ అదేపనిగా రిక్వెస్ట్ చేస్తోంది. అయితే, హసీనా అప్పగింత విషయంలో ఒక లీగల్ ప్రక్రియ ద్వారా భారత్ ముందుకు వెళుతోందని మేము కూడా అదేపనిగా చెబుతున్నాం. హసీనాను మేమేమీ భారత్‌కు తీసుకురాలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గానీ, ఇండియన్ ఆర్మీగానీ ఆమెను భారత్‌కు తీసుకురాలేదు. ఆమెనే ప్రధాని హోదాలో ఇండియాకు వచ్చారు. నాడు బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా హసీనా మా దేశంలో ఉండేందుకు అంగీకరించాం. నాడు బంగ్లాదేశ్‌లో జరిగిన హింస మరే దేశంలోనూ జరగరాదు’’ అని త్రివేదీ అన్నారు.
ఆ డిమాండ్‌తో భారత్, బంగ్లా సంబంధాలపై ప్రభావం
హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ అదేపనిగా చేస్తున్న డిమాండ్‌తో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. 2024 జులైలో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. తర్వాత బంగ్లా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఆగస్టు 5న హసీనా.. బంగ్లాను వదిలి భారత్‌కు వచ్చారు. తర్వాత మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి హసీనాను తమకు అప్పగించాలంటూ యూనుస్ ప్రభుత్వం అదేపనిగా భారత్‌కు విజ్ఞప్తి చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
ఈ వార్తలనూ చదవండి:
మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్
కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్