Share News

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:42 AM

అమెరికాలో త్వరలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వృద్ధులకు ఇన్సూరెన్స్ ప్రీమియం భారం తగ్గించేలా కీలక ప్రకటన చేశారు.

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో త్వరలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ వర్గాల ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. వృద్ధులకు ఇన్సూరెన్స్ ప్రీమియం భారం తగ్గించేలా తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా మరో ప్రకటన చేశారు. వృద్ధులకు మెడికేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారం తగ్గేలా ఒక్కొక్కరికీ 90 డాలర్ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఈ హామీ అమల్లోకి వస్తే సుమారు 20 మిలియన్ల వృద్ధులకు ప్రయోజనం చేకూరనుంది.


గత నెలలో ట్రంప్ ఓ ఎన్నికల ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు సంబంధించి 500 డాలర్ల రిబేట్ చెక్కులు ఇస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ప్రీమియం కింద ఓటర్లకు ఈ చెక్కులు వస్తాయని చెప్పారు. అంతకుముందు కూడా ఇంతకంటే భారీ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని గెలిపిస్తే ఒక్కో వయోజన అమెరికన్ పౌరుడికి 5 వేల డాలర్లు ఇస్తామని అన్నారు. ఈ హామీ నెరవేర్చడానికి 1 ట్రలియన్ డాలర్లు అవసరం అవుతాయని అక్కడి విశ్లేషకులు చెప్పారు. ఈ స్థాయి నిధుల మంజూరుకు అమెరికా చట్టసభల అనుమతులు కూడా తప్పనిసరి అని పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే, ట్రంప్ పాప్యులారిటీ తగ్గుతున్నట్టు ఇటీవల జరిగిన అనేక సర్వేల్లో వెలుగులోకి వచ్చింది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి ట్రంప్ విధానాలే కారణమని అత్యధిక శాతం మంది భావిస్తున్నారు. ఈ విషయంలో కేవలం 17 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు. ట్రంప్ మాత్రం ద్రవ్యోల్బణ భయాల్ని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందంటూ ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్

ఎలాన్‌ మస్క్‌తో నా బంధం ముగిసింది: శివోన్ జిలిస్

Updated Date - Oct 04 , 2026 | 09:34 AM