Share News

ఎలాన్‌ మస్క్‌తో బంధం ముగిసింది

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:27 AM

ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భాగస్వామి, టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ శివోన్‌ జిలిస్‌ తమ బంధానికి..

ఎలాన్‌ మస్క్‌తో బంధం ముగిసింది

  • శివోన్‌ జిలిస్‌ సంచలన ప్రకటన

వాషింగ్టన్‌, అక్టోబరు 3: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భాగస్వామి, టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ శివోన్‌ జిలిస్‌ తమ బంధానికి ముగింపు పలికినట్లు ప్రకటించారు. ఎలాంటి చర్చలు, హెచ్చరికలు లేకుండానే మస్క్‌ ఈ సంబంధాన్ని అకస్మాత్తుగా ముగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మస్క్‌ తనను ఎక్స్‌ వేదికగా అన్‌ఫాలో చేసిన తర్వాత, శుక్రవారం ఆమె ఒక సుదీర్ఘమైన సోషల్‌ మీడియా పోస్టు ద్వారా ఈ బ్రేకప్‌ వార్తను పంచుకున్నారు. ‘‘కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఎంతో ప్రేమగా ఉన్న బంధం నుంచి విడిపోయే స్థితికి రావడం చాలా కష్టం. కానీ కొన్నిసార్లు జీవితంలో ఇలాగే జరుగుతుంది’’ అంటూ జిలిస్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. భారత సంతతికి చెందిన శివోన్‌ జిలిస్‌, ఎలాన్‌ మస్క్‌లకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. బంధం ముగిసినప్పటికీ, పిల్లల భవిష్యత్తు కోసం తామిద్దరం స్నేహితులుగా ఉంటూ, తల్లిదండ్రులుగా సంరక్షణ బాధ్యతలను కలిసి నిర్వర్తిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ బ్రేకప్‌ ప్రకటనపై ఎలాన్‌ మస్క్‌ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

Updated Date - Oct 04 , 2026 | 07:20 AM