Share News

కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:25 AM

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో తనపై జరిగిన దాడి గురించి భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహకు కూలంకషంగా వివరించారు. నాటి భయానక పరిస్థితి గురించి ఆయన వెల్లడించారు.

కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్

ఇంటర్‌నెట్ డెస్క్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో తనపై జరిగిన దాడి గురించి భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహకు కూలంకషంగా వివరించారు. నాటి భయానక పరిస్థితి గురించి ఆయన వెల్లడించారు. ఆరోజు విమానం సాధారణంగానే బయల్దేరిందని, విమానం నడుపుతున్నపుడు తాను కాక్‌పిట్ ముందు వైపు చూస్తున్నానని వెల్లడించారు. ఆ టైంలో తన కోపైలట్ హమామ్ అల్ హమామీ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడన్నారు.


‘చాలా మంది లోకల్స్‌లాగే నా కోపైలట్ కూడా ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు. ప్రార్థనలపై గౌరవంతో నేను కాక్‌పిట్ ముందు వైపు చూస్తున్నాను. నాలుగు ఐదు నిమిషాల తర్వాత అకస్మాత్తుగా నా తల వెనుక వైపు ఏదో గట్టిగా తగిలినట్లు అనిపించింది. విమానానికి ఏదో జరిగినట్లు అనిపించింది. అది కాదని గ్రహించాను. వెనుక నుంచి నా కోపైలట్ నాపై అదేపనిగా దాడులు చేస్తున్నాడని గ్రహించాను. ఆ టైంలో నా విజన్ బ్లర్‌గా మారింది. దీంతో సరిగ్గా చూడలేకపోయాను’ అని మచ్చార్ తెలిపారు.


డోర్ తెరిచినా మళ్లీ మూశాడు..

ఓ వైపు తనపై కోపైలట్ దాడులు చేస్తూనే ఉన్నాడని, దీంతో మరోవైపు విమానం వేగంగా కిందకు దూసుకెళ్లడం ప్రారంభించిందని మచ్చార్ తెలిపారు. ‘కోపైలట్ నాపై దాడులు చేస్తుండడంతో విమానం నడపడం సాధ్యపడలేదు. దీంతో విమానం శరవేగంగా కిందకు దూసుకెళ్లడం ప్రారంభించింది. తేరుకొని కాక్‌పిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించాను. మొత్తానికి డోర్ తెరిచాను. అయినా కూడా కోపైలట్ నాపై మళ్లీ దాడిచేసి డోర్ మూసేశాడు. ఆ టైంలో నేను కాక్‌పిట్ ఫ్లోర్‌పై పడి ఉన్నట్లు గుర్తుంది. విమానం ఊగిసలాడడం, ప్రజల అరుపులు వినిపించాయి. విమానం కూలకుండా అడ్డుకోవడానికి ఒకే ఒక్క మార్గమే ఉన్నట్లు నాకు అనిపించింది. కోపైలట్‌ను అడ్డుకోకపోతే నేను చనిపోవడంతో పాటు విమానంలోని ప్రయాణికులు కూడా చనిపోతారు. అలా జరగరాదని అనుకున్నాను. దీంతో శక్తినంతా కూడదీసుకొని కోపైలట్‌ను పక్కకు తోసి డోర్ తెరిచాను. తర్వాత ప్రయాణికులు లోపలికి వచ్చి కోపైలట్‌ను నిలువరించారు. ఇక మిగతా సంగతి మీకు తెలుసు’ అని మచ్చార్ వివరించారు.


ఇవి కూడా చదవండి..

ఎలాన్‌ మస్క్‌తో బంధం ముగిసింది

ఏఐకి నైతికత.. మంచి నడవడి నేర్పండి!

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2026 | 07:46 AM