Share News

ఏఐకి నైతికత.. మంచి నడవడి నేర్పండి!

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:47 AM

సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లతో సంచలనం సృష్టిస్తున్న ఆంథ్రోపిక్‌.. ప్రముఖ హిందూ సన్యాసి, న్యూయార్క్‌ వేదాంత సొసైటీ అధిపతి స్వామి సర్వప్రియానంద..

ఏఐకి నైతికత.. మంచి నడవడి నేర్పండి!

  • హిందూ సన్యాసి సర్వప్రియానందను కోరిన ఆంథ్రోపిక్‌

న్యూయార్క్‌, అక్టోబర్‌ 3: సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లతో సంచలనం సృష్టిస్తున్న ఆంథ్రోపిక్‌.. ప్రముఖ హిందూ సన్యాసి, న్యూయార్క్‌ వేదాంత సొసైటీ అధిపతి స్వామి సర్వప్రియానంద నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకుంది. మొదట ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ కోసం స్వామిని సంప్రదించిన ఆంథ్రోపిక్‌.. ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయానికి రావాలని ఆహ్వానించింది. సర్వప్రియానంద ఆంథ్రోపిక్‌ కార్యాలయాన్ని సందర్శించి ‘ఏఐ’పై కీలక చర్చల్లో పాల్గొన్నారు. అయితే ఇది ఎప్పుడు జరిగిందన్నది తెలియదు. ఈ ఏడాది జూన్‌లో డాలస్‌లో జరిగిన ‘యూనిటీ ఆఫ్‌ డాలస్‌’ కార్యక్రమంలో భాగంగా స్వామి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంథ్రోపిక్‌ ప్రధాన కార్యాలయంలో వివిధ మత నేతలు, కౌన్సెలర్లు, మానసిక ఆరోగ్య నిపుణులతో తాను సమావేశమైనట్లు స్వామి సర్వప్రియానంద వెల్లడించారు. క్లౌడ్‌ మోడళ్లకు నైతిక విలువలపై శిక్షణ ఇవ్వడంలో తన సూచనలు తీసుకున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 06:50 AM