Share News

థ్రిల్‌ను పంచిన పెళ్లి ప్రపోజల్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 10:30 AM

ఎవరైనా సరే పార్కులోనో, రెస్టారెం ట్లోనో పెళ్లి ప్రపోజల్‌ చేస్తారు. ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్‌ వాల్ష్‌ మాత్రం తన పెళ్లి ప్రతిపాదనను భాగ స్వామికి జీవితాంతం గుర్తుండి పోయేలా చేయాలనుకున్నాడు.

థ్రిల్‌ను పంచిన పెళ్లి ప్రపోజల్‌
Shark Proposal

ఎవరైనా సరే పార్కులోనో, రెస్టారెం ట్లోనో పెళ్లి ప్రపోజల్‌ చేస్తారు. ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్‌ వాల్ష్‌ మాత్రం తన పెళ్లి ప్రతిపాదనను భాగ స్వామికి జీవితాంతం గుర్తుండి పోయేలా చేయాలనుకున్నాడు.

ఇంగ్లాండ్‌లోని లింకన్‌షైర్‌... ప్రదేశం స్కెగ్నెస్‌ అక్వేరియం... అక్కడి సిబ్బంది సహా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కొంతమంది స్కూబా సూట్‌ ధరించి అక్వేరియంలోకి వెళ్లారు. షార్క్‌లు తిరుగు తున్న అక్వేరియంలో ఒక వ్యక్తి ఉంగరం తీసి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్‌ చేశాడు. అందరూ ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చూస్తుంటే... మహిళ ఓకే అంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అంతే... అక్వేరియంలో పెళ్లి ప్రపోజల్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.


book6.2.jpgజేమ్స్‌ వాల్ష్‌, పైజ్‌ కుక్‌ ఇద్దరూ స్నేహితులు. పైజ్‌కి షార్క్‌లంటే చాలా ఇష్టం. అందుకే క్రిస్మస్‌ బహుమతిగా జేమ్స్‌ ఆమెకు షార్క్‌లతో ఈత కొట్టే అనుభవాన్ని బహుమతిగా ఇచ్చాడు. అదే సందర్భాన్ని తన ప్రపోజల్‌కు కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించు కున్నాడు. ‘‘షార్క్‌ అంటే ఆమెకు ఇష్టం. అందుకే ఆమెకు ఇష్టమైన వాటి మధ్యలోనే ప్రపోజ్‌ చేస్తే ప్రత్యేకంగా ఉంటుందని ప్లాన్‌ చేశా’’ అంటాడు జేమ్స్‌.


అక్వేరియం సిబ్బందితో కలిసి...

తన ప్రపోజల్‌ ప్లాన్‌ను జేమ్స్‌ ముందు గానే అక్వేరియం సిబ్బందికి తెలియ జేశాడు. అతని కోసం సిబ్బంది ప్రత్యేకంగా ‘విల్‌ యు మ్యారీ మీ’ అని రాసి ఉన్న బోర్డును సిద్ధం చేశారు. ప్రపోజల్‌ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు జేమ్స్‌, పైజ్‌లను మిగిలిన గ్రూప్‌ నుంచి కొద్దిసేపు విడిగా ఉంచారు. జేమ్స్‌, పైజ్‌ స్కూబా డైవింగ్‌ దుస్తులు, పరికరాలతో షార్క్‌ ట్యాంక్‌లోకి దిగారు. నీటి అడుగున ఇసుక నేలపై ఉన్న సమయంలో జేమ్స్‌ తన చేతిలో ఉన్న బోర్డును పైజ్‌కు చూపించాడు. దాన్ని చూసిన పైజ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే కొద్దిసేపటికి తేరుకున్న పైజ్‌ సైగ చేస్తూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


book6.3.jpgఇద్దరూ నీటి అడుగునే ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘‘నేను పూర్తిగా షాక్‌కు గురయ్యాను. ఎప్పటినుంచో స్కూబా డైవింగ్‌ చేయాలని, షార్క్‌లతో కలిసి ఈత కొట్టాలని కోరుకున్నా. కానీ అక్కడే జేమ్స్‌ నాకు ప్రపోజ్‌ చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్క క్షణం నేను షార్క్‌ ట్యాంక్‌లో ఉన్నాననే విషయాన్నే మర్చిపోయా’’ అంది పైజ్‌. మొత్తానికి జేమ్స్‌, పైజ్‌ పెళ్లి ప్రపోజల్‌కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

తొలి ఏడాది తీపి గుర్తులు!

అది మర్యాద కాదు...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 10:40 AM