Share News

ఇండియా ప్రపోజల్ చాలా గొప్పగా ఉంది: ఉక్రెయిన్

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:45 AM

రష్యాతో కాల్పుల విరమణకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనపై ఉక్రెయిన్ స్పందించింది. రష్యాతో కాల్పుల విరమణపై ఇండియా చేసిన ప్రతిపాదన చాలా గొప్పగా ఉందని ప్రశంసించింది.

ఇండియా ప్రపోజల్ చాలా గొప్పగా ఉంది: ఉక్రెయిన్

ఇంటర్‌నెట్ డెస్క్: రష్యాతోకాల్పుల విరమణకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనపై ఉక్రెయిన్ స్పందించింది. రష్యాతో కాల్పుల విరమణపై ఇండియా చేసిన ప్రతిపాదన చాలా గొప్పగా ఉందని ప్రశంసించింది. సీజ్ ఫైర్‌కు సంబంధించి కీవ్‌కు మొత్తం నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో భారత ప్రతిపాదన చాలా విస్తృతంగా ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయడం, నల్లసముద్రంలో పరిస్థితులు మెరుగయ్యేలా చేయడం వంటి ప్రతిపాదనలకు తాము సిద్ధంగా ఉన్నామని సిబిహా.. మీడియాతో చెప్పారు. ‘‘కాల్పుల విరమణపై మాకు మొత్తం నాలుగు ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో భారత ప్రతిపాదన చాలా విస్తృతంగా ఉంది’’ అని సిబిహా మీడియాకు వెల్లడించినట్లు యూరోపియన్ దినపత్రిక ప్రావ్డా తెలిపింది. కాగా.. కాల్పుల విరమణ, ఇంధన మౌలికసౌకర్యాలపై దాడుల నిలుపుదల, నల్లసముద్రంపై ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేయడం వంటి ప్రతిపాదనలను భారత్ చేసినట్లు సమాచారం.


పుతిన్ ప్రకటన తర్వాత స్పందించిన ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ మధ్య 2022 నుంచి జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మంచి ఐడియా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్‌కు ఆమోదంగా ఉండేలా మోదీ ఒక పరిష్కారాన్ని సూచించగలరని ఆయన చెప్పారు. గత నెల ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులోనూ ఉక్రెయిన్ అంశాన్ని మోదీ ప్రస్తావించారని, ఇరు దేశాలూ ఒక శాంతియుత ఒప్పందానికి రావాల్సిందిగా సూచించారని పుతిన్ పేర్కొన్నారు. తాజాగా ఉక్రెయిన్ కూడా ఇప్పుడు భారత ప్రతిపాదనపై స్పందిస్తూ ప్రశంసలు కురిపించింది. కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా శుక్రవారం భీకరంగా వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల తర్వాత భారత ప్రతిపాదనపై ఉక్రెయిన్ స్పందించింది.


ఇవి కూడా చదవండి..

కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్

ఎలాన్‌ మస్క్‌తో బంధం ముగిసింది

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2026 | 10:22 AM