Share News

గుజరాతీ ఫాజెటో.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:26 PM

గుజరాతీ ఫాజెటో తయారీకి కావాల్సినవి.. పెరుగు - కప్పు, మామిడి గుజ్జు - అర కప్పు, శనగ పిండి - రెండు స్పూన్లు, నీళ్లు - మూడు కప్పులు పచ్చి మిర్చి

గుజరాతీ ఫాజెటో.. తయారు చేసుకోండిలా..
Gujarati Fajeto Recipe

కావలసిన పదార్థాలు: పెరుగు - కప్పు, మామిడి గుజ్జు - అర కప్పు, శనగ పిండి - రెండు స్పూన్లు, నీళ్లు - మూడు కప్పులు పచ్చి మిర్చి - ఒకటి, అల్లం తరుగు - స్పూను, పసుపు - అర స్పూను, పోపు గింజలు - స్పూను, బెల్లం - చిన్న ముక్క, కరివేపాకు రెబ్బలు - ఎనిమిది, ఎండు మిర్చి - రెండు, ఇంగువ - కాస్త, నూనె - కాస్త.


book9.3.jpgతయారుచేసే విధానం: పెద్ద గిన్నెలో పెరుగు, మామిడి గుజ్జు, శనగపిండి, పసుపు, ఉప్పు, నీళ్లు గిలక్కొట్టాలి. ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. పచ్చిమిర్చి, అల్లం తరుగు, బెల్లం కలపాలి. దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి, పోపు పెడితే గుజరాతీ ఫాజెటో సిద్ధం.


ఈ వార్తలు కూడా చదవండి:

త్వరలో ఆర్టీసీలో వెల్ఫేర్‌ కమిటీల రద్దు

స్వయంకృషితో ఎదిగిన మేధావి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 01:26 PM