Share News

మునగాకు రైస్‌.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:50 PM

మునగాకు రైస్‌ తయారీకి కావాల్సినవి..అన్నం - రెండు కప్పులు, మునగాకు - కప్పు(కడిగి, ఎండబెట్టినవి), ఉల్లి ముక్కలు - కప్పు, పచ్చి మిర్చి

మునగాకు రైస్‌.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..
Moringa Leaf Rice Recipe

కావలసిన పదార్థాలు: అన్నం - రెండు కప్పులు, మునగాకు - కప్పు(కడిగి, ఎండబెట్టినవి), ఉల్లి ముక్కలు - కప్పు, పచ్చి మిర్చి - రెండు, ఆవాలు - స్పూను, మినప్పప్పు - స్పూను, కరివేపాకు - పది, నూనె - రెండు స్పూన్లు, పసుపు - కాస్త, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఎండు మిర్చి - రెండు, జీలకర్ర - స్పూను, ధనియాలు - స్పూను, నువ్వులు - స్పూను, పల్లీలు - రెండు స్పూన్లు, జీడిపప్పు - ఎనిమిది, నిమ్మరసం - స్పూను.


book8.jpgతయారుచేసే విధానం: పాన్‌ మీద జీలకర్ర, ఎండు మిర్చి, ధనియాలు, నువ్వులు వేయించాలి. చిటపటలాడుతుంటే మునగాకును కలపాలి. కాస్త వేగాక వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి మసాలాగా చేసుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు వేయించాలి. చిటపటలాడాక ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలు చేర్చాలి. ఉల్లి రంగు మారాక, పల్లీలు, జీడిపప్పు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు పసుపు, అన్నం కలపాలి. పైన మునగాకు మసాలాను వేయాలి. మొత్తం అంతా కలిసేలా చేసి, స్టవ్‌ కట్టేయాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి మొత్తం కలిపితే మునగాకు రైస్‌ రెడీ.


ఈ వార్తలు కూడా చదవండి:

త్వరలో ఆర్టీసీలో వెల్ఫేర్‌ కమిటీల రద్దు

స్వయంకృషితో ఎదిగిన మేధావి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 12:50 PM