Share News

ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ ప్లేయర్ల సామగ్రి చోరీ.. 24 గంటల్లో రికవరీ!

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:16 PM

ఫిఫా ప్రపంచ కప్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్ల బూట్లు, జట్టు సాధన సామగ్రి దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే వస్తువులను రికవరీ చేశారు.

ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ ప్లేయర్ల సామగ్రి చోరీ.. 24 గంటల్లో రికవరీ!
England football team,

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్ల బూట్లు, జట్టు సాధన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. ఫ్లోరిడాలోని శిక్షణ శిబిరం నుంచి మిస్సోరికి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే వస్తువులను రికవరీ చేశారు. ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.


ముస్తఫా సాలీక్, ఎర్ఫాన్ కమల్ అనే ఇద్దరు వ్యక్తులు ఇంగ్లండ్ ప్లేయర్లకు సంబంధించిన సాధన సామగ్రిని దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దోషులుగా తేలితే ఆ ఇద్దరిపై గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ ఇద్దరికి కోర్టు 75 వేల డాలర్లు చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.


ఇంగ్లండ్ జట్టు ఫ్లోరిడాలోని శిక్షణ శిబిరం నుంచి ప్రపంచకప్ బేస్ క్యాంప్‌కు వెళ్తున్న సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్లేయర్లంతా ఒక వాహనంలో ఉండగా, వెనకాలే వస్తున్న మరో వాహనంలో వారికి సంబంధించిన విలువైన సామగ్రి ఉంది. అదే ఇప్పుడు చోరీకి గురైంది. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో తొమ్మిది జతల ఫుట్‌బాల్ బూట్లు, గోల్‌కీపర్ గ్లవ్స్, ప్రపంచకప్ మ్యాచ్ బాల్, శిక్షణ దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటగాళ్ల సంతకాలతో ఉన్న జెర్సీలు ఉన్నాయి. చోరీకి గురైన వస్తువుల్లో జట్టు మ్యాచ్‌లకు అత్యవసరమైన సామగ్రి ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లండ్ తన తొలి మ్యాచ్‌ను ఈనెల 18వ తేదీన క్రొయేషియాతో ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

రోహిత్ శర్మ రనౌట్‌పై స్పందించిన శుభ్‌మన్ గిల్

అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌ మీట్‌ను మధ్యలో ఆపేసిన నితీశ్‌కుమార్ రెడ్డి

Updated Date - Jun 14 , 2026 | 12:17 PM