Share News

రోహిత్ శర్మ రనౌట్‌పై స్పందించిన శుభ్‌మన్ గిల్

ABN , Publish Date - Jun 14 , 2026 | 10:18 AM

ధర్మశాల వేదికగా నిన్న అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ రనౌటైన సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ రియాక్షన్ ఎలా ఉందో గిల్ క్లారిటీ ఇచ్చాడు.

రోహిత్ శర్మ రనౌట్‌పై స్పందించిన శుభ్‌మన్ గిల్
Rohit Sharma run out

స్పోర్ట్స్ డెస్క్: ధర్మశాల వేదికగా శనివారం భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన సహజ శైలిలో బ్యాటింగ్ ఆరంభించాడు. తొలి ఓవర్లలోనే ఆకర్షణీయమైన బౌండరీలు, భారీ సిక్సర్‌తో మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపించాడు. కానీ ఆరో ఓవర్‌లో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఘజన్ ఫర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రోహిత్ రనౌట్ అయ్యాడు. దీనిపై మ్యాచ్ ముగిసిన తర్వాత శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ అసలు నిజాలు బయటపెట్టాడు.


భారత్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో నాలుగో బంతికి రోహిత్ షాట్ ఆడి సింగిల్ కోసం పిలిచాడు. గిల్ కూడా రెండడుగులు ముందుకు వేసి వద్దంటూ వెనక్కి వెళ్లాడు. అప్పటికే రోహిత్ పిచ్ మధ్యలోకి వచ్చేయడంతో రషీద్ ఖాన్ బాల్‌ను కీపర్‌కు విసరడం, రోహిత్ రనౌట్ కావడం క్షణాల్లో జరిగిపోయాయి. రోహిత్ కోపంగా, తీవ్ర నిరాశతో డగౌట్‌కు చేరాడు. ఈ విషయంపై గిల్ మాట్లాడుతూ..'రోహిత్ భాయ్‌కి ఈ రనౌట్ విషయంలో ఎలాంటి కోపం లేదు. తాను డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాక రిప్లే చూసి.. ఫర్వాలేదులే అని చెప్పాడు. గతంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే రనౌటయ్యానని నవ్వేశాడు' అంటూ గిల్ క్లారిటీ ఇచ్చాడు.


ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 16 బంతుల్లో 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అలానే అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో తాను పట్టిన క్యాచ్‌పై కూడా గిల్ స్పందించాడు. 'నేను స్లిప్ క్యాచ్‌లు చాలా ప్రాక్టీస్ చేశాను. నేను ఏ అద్భుతమైన క్యాచ్ పట్టలేదు. కానీ ఇది పట్టినందుకు సంతోషంగా ఉందని నా ఫీల్డింగ్ కోచ్‌తో చెప్పాను' అని గిల్ బదులిచ్చాడు.


ఇవి కూడా చదవండి:

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

ఆసియా క్రీడలకు సింధు, సాత్విక్‌

Updated Date - Jun 14 , 2026 | 10:25 AM