ఆసియా క్రీడలకు సింధు, సాత్విక్
ABN , Publish Date - Jun 14 , 2026 | 09:32 AM
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందంలో పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ సహా మొత్తం ఐదుగురు తెలుగు షట్లర్లకు చోటు దక్కింది. సెప్టెంబరు 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టును శనివారం ప్రకటించారు.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందంలో పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ సహా మొత్తం ఐదుగురు తెలుగు షట్లర్లకు చోటు దక్కింది. సెప్టెంబరు 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టును శనివారం ప్రకటించారు. ఇటీవల జరిగిన జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ప్రదర్శనతో పాటు గతనెల 26వ తేదీ వరకు గల బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌ను పరిగణనలోనికి తీసుకొని ఈ షట్లర్లను ఎంపిక చేసినట్టు జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. వ్యక్తిగత చాంపియన్‌షిప్ విభాగం పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, మహిళల సింగిల్స్‌లో సింధు, ఉన్నతికి చోటు దక్కింది.
అలానే పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్, హరిహరన్-అర్జున్, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ, ప్రియా సెల్వం-సిమ్రాన్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా, టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల్లో కిడాంబి శ్రీకాంత్, తరుణ్, సాత్విక్, లక్ష్య, ఆయుష్, ప్రణయ్, చిరాగ్, హరిహరన్, అర్జున్, ధ్రువ్.. మహిళల్లో సింధు, ఉన్నతి, దేవిక, తన్వీ, ఇషారాణి, జాలీ, గాయత్రి, ప్రియ, సిమ్రాన్, తనీషకు చోటు లభించింది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్ 2026లో బ్రెజిల్‌కు నిరాశ..
తొలి వన్డేలో అఫ్ఘాన్‌పై భారత్ గెలుపు