తొలి వన్డేలో అఫ్హాన్‌పై భారత్ గెలుపు
ABN , Publish Date - Jun 14 , 2026 | 08:00 AM
అఫ్ఘానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో టీమిండియా బోణీ చేసింది. శనివారం జరిగిన వర్ష ప్రభావిత తొలి వన్డేలో భారత్ 7 వికెట్లతో అప్ఘాన్‌ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత అఫ్ఘాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది.
స్పోర్ట్స్ డెస్క్: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84 నాటౌట్) అజేయ అర్ధ శతకంతోపాటు అరంగేట్రం పేసర్ గుర్నూర్ బ్రార్ (3/27) రాణించడంతో.. అఫ్ఘానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో టీమిండియా బోణీ చేసింది. శనివారం జరిగిన వర్ష ప్రభావిత తొలి వన్డేలో భారత్ 7 వికెట్లతో అఫ్ఘాన్‌ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత అఫ్ఘాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. రహ్మనుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీ వృథా అయింది. మరో అరంగేట్రం పేసర్ హర్ష్ దూబే 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, నితీశ్ చెరో 2 వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 3/26తో ఇబ్బందుల్లో పడిన తరుణంలో గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27) నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. అయితే, వీరిద్దరూ అవుటైన తర్వాత అఫ్ఘాన్ పతనం వేగంగా జరిగిపోయింది. అనంతరం ఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 195/3 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్ రోహిత్ (16) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గిల్, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (34) రెండో వికెట్‌కు 70 రన్స్ భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఇషాన్‌ను రషీద్ బౌల్డ్ చేయగా.. శ్రేయాస్ అయ్యర్ (12)ను షరీఫి పెవిలియన్ చేర్చాడు. కానీ, గిల్, కేఎల్ రాహుల్ (39 నాటౌట్) నాలుగో వికెట్‌కు అజేయంగా 53 రన్స్ జోడించడంతో.. భారత్ 13 బంతులు మిగిలుండగానే నెగ్గింది.
స్కోరుబోర్డు:
అఫ్ఘానిస్థాన్: గుర్బాజ్ (బి) నితీశ్ 102, జద్రాన్ (సి) గిల్ (బి) గుర్నూర్ 1, సిద్దికుల్లా (ఎల్బీ) అర్ష్‌దీప్ 0, రహ్మత్ షా (సి) దూబే (బి) అర్ష్‌దీప్ 3, హష్మతుల్లా (సి) రాహుల్ (బి) దూబే 27, ఒమర్జాయ్ (స్టంప్డ్) ఇషాన్ (బి) దూబే 26, నబీ (సి) అర్ష్‌దీప్ (బి) నితీశ్ 9, రషీద్ (బి) గుర్నూర్ 9, ఘజన్‌ఫర్ (సి) గిల్ (బి) దూబే 0, షరీఫి (సి) అర్ష్‌దీప్ (బి) గుర్నూర్ 4, సఫి సలీమ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 24.5 ఓవర్లలో 194 ఆలౌట్; వికెట్ల పతనం: 1-13, 2-16, 3-26, 4-142, 5-144, 6-172, 7-182, 8-182, 9-193, 10-194; బౌలింగ్: అర్ష్‌దీప్ 5-0-27-2, గుర్నూర్ బ్రార్ 4.5-0-27-3, ప్రసిద్ధ్ 5-0-35-0, హర్ష్ దూబే 5-0-47-3, సుందర్ 1-0-19-0, నితీశ్ 4-0-31-2.
భారత్: రోహిత్ (రనౌట్) 16, గిల్ (నాటౌట్) 84, ఇషాన్ (బి) రషీద్ 34, శ్రేయాస్ (సి) సఫీ (బి) షరీఫి 12, రాహుల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 22.5 ఓవర్లలో 195/3; వికెట్ల పతనం: 1-46, 2-116, 3-142; బౌలింగ్: ఒమర్జాయ్ 3-0-28-0, రహ్మాన్ ఫరీఫి 4-0-39-1, ఘజన్‌ఫర్ 5-0-28-0, సలీమ్ సఫీ 3.5-0-36-0, రషీద్ ఖాన్ 5-0-37-1, నబీ 2-0-26-0.
రోహిత్ రికార్డ్..
భారత్ తరఫున వన్డే ఆడిన పెద్ద వయస్కుడిగా రోహిత్ శర్మ (39 ఏళ్లు 75 రోజులు) నిలిచాడు. ఈ క్రమంలో అమర్‌నాథ్ (39 ఏళ్ల 36 రోజులు) రికార్డును హిట్‌మ్యాన్ అధిగమించాడు.
ఇవి కూడా చదవండి:
అదిరిపోయే క్యాచ్ పట్టిన గిల్.. వీడియో వైరల్