Share News

ఆట అదరాలి..

ABN , Publish Date - Jun 14 , 2026 | 03:33 AM

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత జట్టు ఘన విజయంతో ఆరంభించాలనుకొంటోంది. ఇందులో భాగంగా గ్రూప్‌-ఎలో ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో..

ఆట అదరాలి..

  • భారత అమ్మాయిల తొలి పోరు నేడు

  • పాకిస్థాన్‌తో ఢీ

బర్మింగ్‌హామ్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత జట్టు ఘన విజయంతో ఆరంభించాలనుకొంటోంది. ఇందులో భాగంగా గ్రూప్‌-ఎలో ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. 2024లో దుబాయ్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌ను హర్మన్‌ప్రీత్‌ సేన 6 వికెట్లతో చిత్తు చేసింది. ఆ తర్వాత భారత్‌ మెరుగైన జట్టుగా ఎదగగా.. పాక్‌ పరిస్థితిలో పెద్దగా మార్పులు కనిపించిలేదు. అయితే, ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ ఫామ్‌ భారత జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌ టైటిల్‌ రేసులో నిలవాలంటే వీరిద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం ఎంతో అవసరం. ఫామ్‌లో ఉన్న హర్మన్‌, యాస్తికకు తోడు జెమీమా, దీప్తి, రిచా రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. పేసర్లు అమన్‌జోత్‌ కౌర్‌, కష్వీ గౌతమ్‌ అందుబాటులో లేకపోవడంతో బౌలింగ్‌లో లోటు కనిపిస్తోంది. మరోవైపు ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ ఫాతిమా సనాపై పాక్‌ ఎంతో ఆధారపడింది. కానీ, నెట్స్‌లో సనాకు గాయమవడంతో.. ఆమె ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - Jun 14 , 2026 | 03:33 AM