కౌంటీ ఛాంపియన్‌షిప్: అరంగేట్రంలోనే సత్తా చాటిన మానవ్ సుతార్
ABN , Publish Date - Jun 13 , 2026 | 09:12 PM
అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే 7 వికెట్లు తీసి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వార్విక్‌షైర్ తరఫున అరంగేట్రం చేసిన మానవ్.. అక్కడ కూడా అదరగొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే 7 వికెట్లు తీసి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. ఆ అద్భుత ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో మానవ్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వార్విక్‌షైర్ తరఫున అరంగేట్రం చేసిన మానవ్.. అక్కడ కూడా అదరగొట్టాడు. యార్క్‌షైర్‌పై మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
తొలి రోజు యార్క్‌షైర్‌పై సుతార్ తన తొలి కౌంటీ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న యార్క్‌షైర్ బ్యాటర్ సామ్ వైట్‌మన్ (55)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఓపెనర్ విలియం లక్స్‌టన్‌ను ఎల్బీగా ఔట్ చేసి అతడి 167 పరుగుల భారీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రెండో రోజు జార్జ్ హిల్ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుని యార్క్‌షైర్ పతనాన్ని శాసించాడు. ఓవర్‌నైట్ స్కోరు 386/6తో రెండో రోజు ప్రారంభించిన యార్క్‌షైర్.. మరో 83 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది.
టెస్టు అరంగేట్రం తర్వాత..
అఫ్గానిస్థాన్‌తో ఇటీవల ముగిసిన టెస్టులో సుతార్ సంచలన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/33తో చెలరేగిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో మరో వికెట్ సాధించి మ్యాచ్‌లో మొత్తం ఏడు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. భారత్ ఆ మ్యాచ్‌ను ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో గెలిచింది. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ తరఫున నిలకడగా రాణించిన సుతార్.. ఇప్పటివరకు 136 ఫస్ట్‌క్లాస్ వికెట్లు సాధించి భారత జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మరో రెండు రౌండ్లకు వార్విక్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్ల గురించి మాకు సంబంధం లేదు: బీసీసీఐ
ఎవరిపై ఓడినా పర్వాలేదు.. పాక్‌పై మాత్రం గెలవాలి: జెమీమాతో వాచ్‌మెన్