Share News

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

ABN , Publish Date - Jun 13 , 2026 | 07:38 PM

స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

రోహిత్ శర్మ అరుదైన రికార్డు
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో ప్రస్తుతం భారత్ తొలి వన్డే మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 39 సంవత్సరాల 44 రోజులు. ఈ రికార్డు ఇప్పటివరకు1983 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉండేది. అమర్‌నాథ్ 1989 అక్టోబర్ 30న వెస్టిండీస్‌తో జరిగిన తన చివరి వన్డేలో 39 సంవత్సరాల 36 రోజుల వయసులో ఆడాడు. అయితే దాదాపు 37 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును హిట్‌మ్యాన్ బద్దలు కొట్టాడు.


మ్యాచ్ విషయానికొస్తే..

ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైంది. ఆటను 25 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఇద్దరు యువ ప్లేయర్లు అరంగేట్రం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్.. ఈ వార్త రాసే సమయానికి 19 ఓవర్లలకు 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(102) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్ తలొక వికెట్ తీశారు. అర్ష్‌దీస్ సింగ్ 2, నితీశ్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్ల గురించి మాకు సంబంధం లేదు: బీసీసీఐ

ఎవరిపై ఓడినా పర్వాలేదు.. పాక్‌పై మాత్రం గెలవాలి: జెమీమాతో వాచ్‌మెన్

Updated Date - Jun 13 , 2026 | 08:11 PM