ఎవరిపై ఓడినా పర్వాలేదు.. పాక్‌పై మాత్రం గెలవాలి: జెమీమాతో వాచ్‌మెన్
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:23 PM
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ఇప్పటికే మొదలైంది. ఆదివారం టీమిండియా తన తొలి మ్యాచ్‌ను బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ఇప్పటికే మొదలైంది. ఆదివారం టీమిండియా తన తొలి మ్యాచ్‌ను బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. ఈ క్రమంలో తన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌తో జరిగిన ఓ సంభాషణను గుర్తు చేసుకుంది.
‘నేను మొదటిసారి పాక్‌తో మ్యాచ్ ఆడినప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో మా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాతో మాట్లాడింది. భారత్-పాక్ మ్యాచ్ అంటే బయట నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పింది. అంతేకాకుండా మా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కూడా.. ‘ఎవరిపైన ఓడినా పర్వాలేదు.. కానీ పాకిస్థాన్‌పై మాత్రం ఓడొద్దు. ఆ మ్యాచ్‌లో మనం తప్పకుండా గెలిచి తీరాలి’ అని చెబుతుంటాడు. ఈ మ్యాచ్‌పై ప్రజలకు ఎంత ఆసక్తి ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు’ అని జెమీమా వెల్లడించింది.
అదే మా లక్ష్యం..
‘ప్రపంచ కప్ ట్రోఫీని గెలిచిన దృశ్యాన్ని మేమంతా ప్రతిరోజూ ఊహించుకుంటాం. జట్టుగా కూర్చొని ఆ విజన్‌ను మనసులో పెట్టుకుంటాం. ఒక లక్ష్యాన్ని నిరంతరం ఊహిస్తే దానివైపు ప్రయాణం మొదలవుతుందని మేము నమ్ముతాం. వన్డే ప్రపంచ కప్ సమయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించాం. అందుకే కప్ నెగ్గాం. ప్రతి మ్యాచ్‌కు వేర్వేరు ప్రణాళికలతో సిద్ధమవుతాం. ప్రాక్టీస్‌లోనే ఒత్తిడితో కూడిన పరిస్థితులను సృష్టించుకుని వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. మ్యాచ్‌లో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ముందుగానే అనుభవిస్తే అసలు పోటీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాకపోయినా, ఆ ఓటముల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం’ అని జెమీమా వివరించింది.
ఇవి కూడా చదవండి:
పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు.. బంగ్లా క్రికెటర్ ఆరోపణలు
ఆస్ట్రేలియా ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి