Share News

ఆస్ట్రేలియా ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి

ABN , Publish Date - Jun 13 , 2026 | 02:48 PM

ఆస్ట్రేలియా ఓపెన్ 2026 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌లోనే నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీస్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, జపాన్ స్టార్ అకానె యమగుచి చేతిలో సింధు పరాజయం పాలైంది.

ఆస్ట్రేలియా ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి
PV Sindhu

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఓపెన్ 2026 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌లోనే నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీస్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, జపాన్ స్టార్ అకానె యమగుచి చేతిలో సింధు వరుస గేమ్‌ల్లో పరాజయం పాలైంది. 22-20, 21-12 తేడాతో సునాయస విజయం సాధించిన యమగుచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.


మ్యాచ్ ఆరంభంలో సింధు అద్భుత ఆటతో ఆకట్టుకుంది. దూకుడైన షాట్లతో ఆధిక్యంలో నిలిచిన ఆమె తొలి గేమ్‌లో యమగుచికి గట్టి పోటీ ఇచ్చింది. బ్రేక్ సమయం వరకు మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించినా.. ఆ తర్వాత క్రమంగా పట్టు కోల్పోయింది. తొలి గేమ్ చివరి దశలో సింధు 20-20తో సమం చేసి ఆశలు రేకెత్తించింది. కానీ ఆ తర్వాతి గేమ్‌లో యమగుచి రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. రెండో గేమ్‌లో సింధు వేగం పెంచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వరుస పాయింట్లతో యమగుచి భారీ ఆధిక్యం సంపాదించింది. వరుసగా 7 పాయింట్లు సాధించి 13-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన యమగుచి.. ఆపై వెనక్కి తిరిగి చూసుకోకుండా 21-12 తేడాతో సునాయస విజయం సాధించింది. దీంతో యమగుచి వరుసగా నాలుగో టూర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.


ఇవి కూడా చదవండి:

భారత్, అఫ్గాన్ తొలి వన్డేకు పొంచి ఉన్న వాన ముప్పు!

వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత ఇన్నింగ్స్..

Updated Date - Jun 13 , 2026 | 04:57 PM