Share News

ఇంగ్లండ్ ప్లేయర్లకు ఊహించని షాక్.. శిక్షణా పరికరాలు చోరీ

ABN , Publish Date - Jun 13 , 2026 | 02:33 PM

సాకార్ మహా సంగ్రామంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఇంగ్లండ్ జ‌ట్టుకు చేదు అనుభ‌వం ఎదురైంది. ప్లేయర్లకు సంబంధించిన పలు బూట్లు, శిక్షణా పరికరాలు, మ్యాచ్ బాల్స్ భారీగా చోరీకి గురయ్యాయి. దీంతో ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్‌కు ఆటకం ఏర్పడింది.

ఇంగ్లండ్ ప్లేయర్లకు ఊహించని షాక్.. శిక్షణా పరికరాలు చోరీ
England football team

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ‌కప్‌ 2026లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ జట్టు అమెరికాకు వెళ్లింది. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో ఇంగ్లీష్ జట్టు ఉంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ప్లేయర్లకు చేదు అనుభ‌వం ఎదురైంది. వారికి సంబంధించిన పలు జతల బూట్లు, ఫుట్‌బాల్ శిక్షణకు సంబంధించిన పలు పరికరాలు, మ్యాచ్ బాల్స్ చోరీకి గురయ్యాయి. దీంతో వారి ప్రాక్టీస్ సెషన్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఇంగ్లండ్ జట్టుకు సంబంధించిన సామగ్రిని ఫోరిడాలోని వారి శిక్షణ కేంద్రం నుంచి మిస్సోరిలోని స్వోప్ సాకర్ విలేజ్‌కు తరలించాల్సి ఉంది. వాటిని ఓ వాహనంలో మిస్సోరికి తరలిస్తుండగా దొంగతనం చోటుచేసుకుంది. పరికరాలను తరలిస్తున్న వాహనం తాళాలను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఈ దొంగతానికి పాల్పడ్డారు. ఆ వ్యాన్‌లో ఉన్న అన్ని వస్తువులను చోరీ చేసి.. ఒక్క ఫుట్‌బాల్‌ను మాత్రమే విడిచిపెట్టారు. చోరీకి గురైన వస్తువుల్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ వ్యక్తిగత బూట్లు కూడా ఉన్నట్లు సమాచారం.


కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 18న క్రొయేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇవాళ(శనివారం) కాన్సాస్ సిటీలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనాల్సి ఉంది. అంతలోనే ఈ ఊహించని సంఘటనతో ఇంగ్లండ్ ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన కాన్సాస్ పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

భారత్, అఫ్గాన్ తొలి వన్డేకు పొంచి ఉన్న వాన ముప్పు!

వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత ఇన్నింగ్స్..

Updated Date - Jun 13 , 2026 | 02:49 PM