భారత్, అఫ్గాన్ తొలి వన్డేకు పొంచి ఉన్న వాన ముప్పు!
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:32 PM
ధర్మశాల వేదికగా ఇవాళ భారత్ , అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ(శనివారం) ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్లూ జెర్సీలో కనిపించనున్నాడు. అయితే రోహిత్ ఆట చూద్దామనుకునే అభిమానులకు నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో దాదాపు 90 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండటంతో మ్యాచ్‌కి తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.
శుక్రవారం సాయంత్రం నుంచి ధర్మశాలలో వర్షం పడుతుంది. ఇవాళ ఉదయం కూడా కాసేపు చిన్నపాటి వర్షం కురిసింది. మరోసారి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య భారీగా వర్షం కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు, ఉరుములు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ఇవాళ ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని అమలు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత ఇన్నింగ్స్..
ఫిఫా ప్రపంచ కప్ 2026: అమెరికా సంచలన విజయం