భారత్-అఫ్గాన్ తొలి వన్డే: టాస్ నెగ్గిన టీమిండియా
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:31 PM
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. కాగా మ్యాచ్ 5.45 గంటలకు ప్రారంభం కానుంది. అయితే యువ ప్లేయర్లు హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్ ఈ వన్డేతో అరంగేట్రం చేయనున్నారు.
భారత తుది జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
అఫ్గాన్ తుది జట్టు:
హష్మతుల్లా షాహిది(కెప్టెన్), ఇబ్రహీం జర్దాన్, రహమానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, రహత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సాఫీ, ఘజన్‌ఫర్, జియా ఉర్ రెహమాన్ షరీఫీ
ఇవి కూడా చదవండి:
పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు.. బంగ్లా క్రికెటర్ ఆరోపణలు
ఆస్ట్రేలియా ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి