అఫ్గాన్‌తో తొలి వన్డే: గుర్బాజ్ సెంచరీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Jun 13 , 2026 | 08:09 PM
భారత్‌తో ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక దశలో 26 పరుగులకే అఫ్గాన్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(102; 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
గుర్బాజ్ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. హష్మతుల్లా షాహిది(27), అజ్మతుల్లా ఒమర్జాయ్(26) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అరంగేట్రంలోనే హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్ తలో 3 వికెట్లతో చెలరేగారు. అర్ష్‌దీప్ సింగ్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్ల గురించి మాకు సంబంధం లేదు: బీసీసీఐ
ఎవరిపై ఓడినా పర్వాలేదు.. పాక్‌పై మాత్రం గెలవాలి: జెమీమాతో వాచ్‌మెన్