180 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం.. లిస్ట్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ..
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:13 PM
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గొప్ప మనసు చాటుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలానికి చెందిన 180 మంది విద్యార్థులకు ఆర్థికసాయం చేయబోతున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గొప్ప మనసు చాటుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలానికి చెందిన 180 మంది విద్యార్థులకు ఆర్థికసాయం చేయబోతున్నారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 9, 10వ తరగతిలో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన వారికి విజయ్, రష్మిక దంపతులు నగదు బహుమతులు అందించబోతున్నారు. ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్ 2026’కు ఎంపికైన 180 మంది విద్యార్థుల లిస్ట్‌ను విజయ్ దేవరకొండ స్వయంగా ప్రకటించారు.
ఈ మేరకు ఆదివారం ఉదయం తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మేము తమ్మున్‌పేట్‌కు వెళుతున్నాము. ఆ గ్రామంలోనే మా నాన్న జన్మించాడు. మా చిన్న కలకు సంబంధించి నేను, రష్మిక ఫిబ్రవరి నెలలో ఓ అనౌన్స్‌మెంట్ చేశాం. తెలంగాణ, అచ్చంపేట మండలంలో 9,10వ తరగతిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆర్థికసాయం చేస్తాం అని చెప్పాం. తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన ఆ 180 మంది విద్యార్థుల లిస్ట్ ఇదే’ అని రాసుకొచ్చారు. లిస్ట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి
చరిత్ర సృష్టించిన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్
బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..