Share News

త్వరలో ఆర్టీసీలో వెల్ఫేర్‌ కమిటీల రద్దు

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:53 AM

ఆర్టీసీలో సంక్షేమ (వెల్ఫేర్‌) కమిటీలు త్వరలో రద్దు కానున్నాయి. 2019 సమ్మె తర్వాత అప్పటి ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసి ప్రతి డిపోలో ఇద్దరు, ముగ్గురు ...

త్వరలో ఆర్టీసీలో వెల్ఫేర్‌ కమిటీల రద్దు

ఆర్టీసీలో సంక్షేమ (వెల్ఫేర్‌) కమిటీలు త్వరలో రద్దు కానున్నాయి. 2019 సమ్మె తర్వాత అప్పటి ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసి ప్రతి డిపోలో ఇద్దరు, ముగ్గురు అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి నెలా ఈ కమిటీలు సమావేశమై కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని తమ పరిధిలో ఉన్న వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, మిగతా వాటిని ఉన్నతాధికారులు, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం వాటి బాధ్యతలు. అయితే కొంత కాలంగా ఈ కమిటీలు సమావేశం కావడం లేదు. పైగా ఈ కమిటీలు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కార్మికుల నుంచి విమర్శలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలో ఆర్టీసీలో వెల్ఫేర్‌ కమిటీలను రద్దు చేసి యూనియన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. యూనియన్ల ఎన్నికలకు ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారి నియామకం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వెల్ఫేర్‌ కమిటీలతో పని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీల రద్దుకు సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం నుంచి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Updated Date - Jun 14 , 2026 | 04:53 AM