Share News

రాజకీయాల్లోకి అమ్మాయిలు రావాల్సిన అవసరం ఉంది: పీవీయన్ మాధవ్

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:59 PM

అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవియన్ మాధవ్ అన్నారు. 25 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆకాంక్షించారు.

రాజకీయాల్లోకి అమ్మాయిలు రావాల్సిన అవసరం ఉంది: పీవీయన్ మాధవ్
PVN Madhav

విజయవాడ, జూన్ 13: అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవియన్ మాధవ్ అన్నారు. 25 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆకాంక్షించారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసేలా బీజేపీ తన వంతు కృషి చేస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బీజేవైఎం పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవియన్ మాధవ్ ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యువత ప్రతీ ఏడాది క్యాలెండర్‌ను పెట్టుకుని.. వాటిని అమలు చేసే విధానాన్ని అలవరుచుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళమెత్తాలి. అదే సమయంలో విపక్షాలు చేసే కుట్రపూరిత దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. కేంద్రం వంద శాతం నిధులు ఇచ్చిన ఏకైక ప్రాజెక్టు పోలవరం. త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యమైన తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి. 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నేడు ఏపీకి వచ్చాయి’..


‘అనేక ప్రాజెక్టులు పెట్టేందుకు ఏపీకి చాలా మంది పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. విశాఖలో డేటా సెంటర్‌తో పాటు, అనేక భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. మోదీ ఆలోచనలు, ఆకాంక్షలు, అభివృద్ది అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి. ప్రపంచంలో భారతదేశం ప్రత్యేకంగా తన స్థానాన్ని నిలబెట్టుకున్న తీరు, మోదీ పని విధానం గురించి అందరూ తెలుసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది, మోదీ అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి. కీటకాలతో పార్టీ పెట్టుకున్న వారి వెనుక ఎవరున్నారనేది బహిర్గతం అయింది. దేశాన్ని అభివృద్ది బాటలో నడిచేలా యువత మంచి లక్ష్యంతో పని చేయాలి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

మునగాకు రైస్‌.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..

యూఎస్‌తో డీల్‌పై గుస్సా.. ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు

Updated Date - Jun 14 , 2026 | 01:03 PM