ఈఎస్ఐ అసోసియేషన్ అధ్యక్షుడిగా శేషగిరిరావు
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:51 AM
ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా డా.ఎన్.శేషగిరిరావు ఎన్నికయ్యారు.
అమరావతి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా డా.ఎన్.శేషగిరిరావు ఎన్నికయ్యారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలను విజయవాడలోని ఈఎ్‌సఐ ఆస్పత్రిలో నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వి.సురేశ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్‌గా డా.కె.జీవిత, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్.గిరిధర్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీ పోస్టులకు ఓటింగ్ జరిగింది. ఎన్నికల నిర్వహణకు డా.కె.విష్ణువర్ధన్, అబ్జర్వర్‌గా డా.సత్యం హాజరయ్యారు. మిగిలిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ ఉంటుంది.