Vantalu: మటన్ పులావ్
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:47 AM
మటన్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు : మటన్-అర కిలో, బాస్మతీ బియ్యం - రెండు కప్పులు, ఉల్లిగడ్డలు - రెండు, టమాటాలు- రెండు, పచ్చిమిర్చి - మూడు.
కావాల్సిన పదార్థాలు : మటన్-అర కిలో, బాస్మతీ బియ్యం - రెండు కప్పులు, ఉల్లిగడ్డలు - రెండు, టమాటాలు- రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు, నెయ్యి - రెండు టీ స్పూన్లు, పసుపు - అర టీ స్పూన్, గరం మసాలా - ఒక టీ స్పూన్, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర- ఒక కట్ట, నీళ్లు - నాలుగు కప్పులు, ఉప్పు, నూనె - తగినంత.

తయారీ విధానం : ముందుగా మటన్‌ని శుభ్రంగా కడగాలి. కాసేపు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద కుక్కర్‌లో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. దీంట్లో మటన్ కూడా వేసి ఐదు నిమిషాల పాటు నూనెలో ఉడికించుకోవాలి. ఇందులో గరం మసాలా వేసి నిమిషం తర్వాత నీళ్లు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ సగానికి పైగా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం మటన్‌లో వేసి కలిపి మూత పెట్టి రెండు నుంచి మూడు విజిల్స్ రానివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే యమ్మీ పులావ్ రెడీ!
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News