దీపాలు ఎక్కువసేపు వెలగాలంటే.. ఖర్చు లేని సింపుల్ చిట్కా!
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:19 AM
దీపావళి అంటేనే దీపాల పండుగ. ప్రతి ఇంట దీపాలు వెలిగిస్తారు. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. ఇంటా బయట దీపాలు పెడతారు. నూనె లేదా ఆవు నెయ్యితో ఈ దీపాలు వెలిగిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి అంటేనే దీపాల పండుగ. ప్రతి ఇంట దీపాలు వెలిగిస్తారు. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. ఇంటా బయట దీపాలు పెడతారు. నూనె లేదా ఆవు నెయ్యితో ఈ దీపాలు వెలిగిస్తారు. కొన్నిసార్లు చిన్నపాటి గాలికి ఈ దీపాలు ఆరిపోతాయి. దీపం వెంటనే ఆరిపోకుండా.. వీలైనంత ఎక్కువ సేపు వెలుగుతూ ఉండేలా చేయడానికి సింపుల్ చిట్కా ఉంది. అందుకు ఏ మాత్రం ఖర్చు కాదు. ఇంట్లోని వస్తువును ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.
దీపావళి వేళ మట్టిదీపంలో వత్తి వేసి.. చమురు పోస్తారు. ఆ తర్వాత వత్తి వెలిగించే ముందు చిన్న పని చేయాలి. ఇంట్లోని నెయిల్ పాలీష్ తీసుకోవాలి. దీపంలో పెట్టిన వత్తి చివర నెయిల్ పాలిష్‌ను కొద్దిగా రాయాలి. ఆ తర్వాత దీపం వెలిగించాలి. దీంతో ఎంత గాలి వచ్చినా దీపం ఆరిపోదు. దీపం వీలైనంత ఎక్కువ సమయం వెలుగుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఇద్దరు దొంగల అరెస్ట్.. 37 తులాల బంగారం స్వాధీనం
పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
Read Latest Pratyekam And Telugu News