హైదరాబాద్లో ఇద్దరు దొంగల అరెస్ట్.. 37 తులాల బంగారం స్వాధీనం
ABN , Publish Date - Nov 01 , 2026 | 09:21 AM
ఉప్పల్ జోన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 37 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 01: ఉప్పల్ జోన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 37 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు మహిళ అని పోలీసులు తెలిపారు.
జయ అనే మహిళ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిందని వివరించారు. దీంతో ఆమె చోరీల బాట పట్టిందని పేర్కొన్నారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా బురఖా ధరించి ఆమె ఈ చోరీలకు పాల్పడుతుందని పోలీసులు చెప్పారు.
ఇక నవీన్ అనే వ్యక్తి 20 రోజుల్లో 10 చోరీలు చేశాడని తెలిపారు. ఇటీవల అతడు జైలు నుంచి విడుదలయ్యాడని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడని వివరించారు. వీరు ఆన్లైన్లో దొంగతనం చేసే పద్ధతులు నేర్చుకుంటున్నారని పోలీసులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..
Read Latest AP News And Telugu News