Share News

పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

ABN , Publish Date - Nov 01 , 2026 | 08:59 AM

పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలని ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయని వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని వారికి స్పష్టం చేశారు. పార్టీలను కాదు.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు.

పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
MLA Nandamuri Balakrishna

హిందూపురం, నవంబర్ 01: పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలని ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయని వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని వారికి స్పష్టం చేశారు. పార్టీలను కాదు.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం చౌడేశ్వరి కాలనీ మూడో వార్డులోని.. మొదటి పోలింగ్ బూత్‌లో నందమూరి బాలకృష్ణ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది.. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటు అని వివరించారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలన్న ఓటర్లకు స్పష్టం చేశారు.


ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ సమానమేనని అన్నారు. ఎమ్మెల్యే అయినా సామాన్యుడైనా ఓటు విలువ ఒక్కటేనని చెప్పారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్ద సామాన్య ఓటరుతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్యూ లైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 09:09 AM