వంటలు: భర్వా ప్యాజ్ కీ సబ్జీ
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:35 PM
రాజస్థానీ వంటకాల్లో ప్రత్యేకమైన భర్వా ప్యాజ్ కీ సబ్జీని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు: చిన్న సైజు ఉల్లిగడ్డలు - ఆరు, జీలకర్ర - స్పూను, సోంఫు గింజలు - స్పూను, ఎండు మిర్చి- మూడు, లవంగాలు - నాలుగు, వేయించిన శనగపప్పు- రెండు స్పూన్లు, పసుపు- స్పూను, కారం- స్పూను, ఆమ్‌చూర్ - స్పూను, పెరుగు - పావు కప్పు,శనగ పిండి - స్పూను, ధనియాల పొడి - స్పూను, మసాలా పొడి - స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, నీళ్లు, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: అన్ని గింజలు, సుగంధ ద్రవ్యాలను ఓ పాన్ మీద వేయించాలి. సువాసన వస్తుంటే పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమంలో శనగ పప్పు, ఆమ్‌చూర్ కలిపి చల్లారాక మిక్సీలో వేసి మసాలా పొడి తయారుచేసుకోవాలి. ఉల్లిగడ్డల పొట్టు తీసి పూర్తిగా కాకుండా కాస్త అడ్డంగా, నిలువుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కో ఉల్లిగడ్డ రెక్కలు తెరచి మసాలా పొడిని దట్టించాలి. ఇలా అన్నిటికీ చెయ్యాలి. ఓ వెడల్పాటి పాన్ మీద కాస్త నూనె వేసి అన్ని ఉల్లిగడ్డల్నీ పెట్టి ఉడికించాలి. ఓ గిన్నెలో పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి కలుపుకోవాలి. కాస్త నీళ్లు కలిపి జారుగా చేసి బాణలిలో ఉడికించాలి. అంతా దగ్గరవుతుంటే ఉల్లిగడ్డల ప్యాన్‌లో వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేయాలి. పైన కొత్తిమీర తరుగు చల్లితే రాజస్థానీ భర్వా ప్యాజ్ కీ సబ్జీ తయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!
ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...
Read Latest AP News And Telangana News And International News And Telugu News