Share News

వరుసగా రెండు హాఫ్ సెంచరీలు.. ధోనీ రికార్డును సమం చేసిన ధ్రువ్ జురెల్

ABN , Publish Date - Nov 29 , 2026 | 10:36 AM

టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ న్యూజిలాండ్ గడ్డపై సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న అరుదైన రికార్డును సమం చేశాడు.

వరుసగా రెండు హాఫ్ సెంచరీలు.. ధోనీ రికార్డును సమం చేసిన ధ్రువ్ జురెల్
Dhruv Jurel

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ న్యూజిలాండ్ గడ్డపై సత్తా చాటుతున్నాడు. కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుసగా రెండో అర్ధ సెంచరీ నమోదు చేసి భారత జట్టును ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న అరుదైన రికార్డును సమం చేశాడు. మరో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ధోనీ రికార్డును అధిగమించే ఛాన్స్ కూడా జురెల్‌కు ఉంది.


కివీస్‌పై తొలి టెస్టులో జురెల్ 78 పరుగులు, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులతో రాణించాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఏడో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి వరుసగా రెండు టెస్టు అర్ధ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా జురెల్ నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే రికార్డును సమం చేశాడు. 1990లో న్యూజిలాండ్ పర్యటనలో కిరణ్ మోరే వరుసగా 73, 50 పరుగులు చేశాడు. ఇక ధోనీ 2009లో వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. 2014లో ఇదే మైదానంలో ఎనిమిదో స్థానంలో మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌తో టెస్టు: జురెల్ సెంచరీ మిస్.. 246 పరుగులకే భారత్ ఆలౌట్

మైదానంలోనే క్లాస్ తీసుకున్నాడు.. అప్పుడు ధోనీని చూసి భయపడ్డా: కుల్‌దీప్ యాదవ్

Updated Date - Nov 29 , 2026 | 10:41 AM