Share News

వంటలు: అంజీర్‌ కీ టిక్కీ

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:09 PM

అంజీర్‌ కీ టిక్కీ తయారీకి కావలసిన పదార్థాలు: మేడి పండు - కప్పు, ఉడికించిన ఆలు - అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు - అర స్పూను, కొత్తిమీర తరుగు - అర కప్పు, గరం మసాలా - అర స్పూను.

వంటలు: అంజీర్‌ కీ టిక్కీ
Vantalu

కావలసిన పదార్థాలు: మేడి పండు - కప్పు, ఉడికించిన ఆలు - అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు - అర స్పూను, కొత్తిమీర తరుగు - అర కప్పు, గరం మసాలా - అర స్పూను, జీలకర్ర పొడి - అర స్పూను, వేయించిన శనగ పిండి - స్పూను, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.

తయారుచేసే విధానం: మేడి పండును వేడి నీళ్లలో నానబెట్టి, ముక్కలుగా కట్‌ చేయాలి. ఈ ముక్కలకు కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు చేర్చి మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. ఉడికించిన ఆలూకు, గరం మసాలా, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా, శనగ పిండి కలిపి ఇంకో ముద్ద చేసుకోవాలి. ఆలూ మిశ్రమం నుంచి చిన్న ముద్దను తీసుకుని అందులో అంజీర్‌ ముద్దను పెట్టి చేత్తో వత్తుకుని బాణలిపై కాస్త నూనె వేసి అటూ ఇటూ దోరగా కాలిస్తే అంజీర్‌ కీ టిక్కీ తయారు. ఇవి రుచికరంగా ఉంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

శీతాకాలం... సరస్సు ఖాళీ!

డప్పుల దరువులో ఒక అడవి కథ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 01:09 PM