వంటలు: మోచికో డాంగో.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:49 PM
మోచికో డాంగో తయారీకి కావలసిన పదార్థాలు.. వరిపిండి- కప్పు, చక్కెర పొడి - ముప్పావు కప్పు, గులాబీ రంగు - చిటికెడు, నెయ్యి - స్పూను, వేడి నీళ్లు - కప్పు.
కావలసిన పదార్థాలు: వరిపిండి- కప్పు, చక్కెర పొడి - ముప్పావు కప్పు, గులాబీ రంగు - చిటికెడు, నెయ్యి - స్పూను, వేడి నీళ్లు - కప్పు.
తయారుచేసే విధానం: వరిపిండి, చక్కెర పొడిని కలపాలి. ఓ ప్యాన్‌లో నీళ్లు వేసి, నెయ్యి కలిపి మరిగించాలి. ఈ వేడి నీళ్లని వరిపిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. పిండంతా దగ్గర య్యేంత వరకు కలిపి పక్కనపెట్టాలి. చల్లారాక పిండి ముద్దల్ని రెం డుగా విభజించుకోవాలి. ఒక దాంట్లో గులాబీ రంగు కలిపి ముద్దగా చేసుకోవాలి. మరో దాన్ని అలాగే తెల్లగా ఉంచాలి. నిమ్మకాయంత సైజులో రెండింటి నుంచి చిన్న చిన్న బియ్యం ముద్దల్ని చేసి, వీటిని ఆవిరి మీద ఉడికిస్తే జపాన్‌కు చెందిన స్వీట్ మోచికో డాంగో సిద్ధం.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News